హాలీడేని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న చైతూ జంట

Thu,December 29, 2016 09:25 AM
Samantha, Naga Chaitanya enjoyed at Maldives

మరి కొద్ది రోజులలోనే పెళ్ళి పీటలెక్కనున్న లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత. ప్రస్తుతం వీరిద్దరు మాల్దీవులలో హాలీడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగకి ముందే అక్కడికి చేరుకున్న ఈ జంట క్రిస్మస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా విదేశాలలోనే జరుపుకోవాలని భావిస్తున్నారట చైతూ అండ్ సమంత. జనవరి 29,2017న చైతూ, సమంత నిశ్చితార్ధం జరగనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరు ఒక్కటి కానుండగా, వీరి ఎంగేజ్ మెంట్ తో పాటు పెళ్ళి వేడుకని ఇక్కడే గ్రాండ్ గా నిర్వహించాలని నాగ్ భావిస్తున్నాడట. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతూ. సమంత ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా ఒప్పుకోకపోయిన తమిళంలో మాత్రం ఓ మూడు సినిమాలు చేస్తోంది. త్వరలోనే తెలుగు సినిమా ప్రాజెక్ట్ విషయాలను వెల్లడిస్తానని సమంత ఆ మధ్య ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

2997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles