'ఓ బేబీ'.. టీజర్ వచ్చేసింది.. సమంత నటన అదుర్స్..!

Sat,May 25, 2019 05:00 PM
samantha oh baby teaser released

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ఓ బేబీ. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య, రావు రమేశ్, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్ కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్న ఓ బేబీ సినిమా టీజర్‌ను సినిమ యూనిట్ రిలీజ్ చేసింది.

ఇప్పటికే ఓ బేబీ ఫస్ట్ లుక్ విడుదలయి సంచలనాలు సృష్టించింది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఈ సినిమా రిమేక్.

సినిమా టీజర్ విషయానికి వస్తే.. టీజర్ మాత్రం ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంటుంది. టీజరే ఇంత వినోదాత్మకంగా ఉంటే.. మూవీ ఇంకెంత వినోదాన్ని పంచుతుందోనని సినీ అభిమానులు అంచాలు వేస్తున్నారు. ఓ బేబీలో సమంత సింగర్‌గా కనిపిస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్, సమంత నటన అదుర్స్ అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఓ బేబీ టీజర్ చూసేయండి మరి..

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles