అమ‌లాపాల్ 'ఆమె' టీజ‌ర్‌పై స‌మంత ప్రశంస‌లు

Wed,June 19, 2019 09:35 AM

విభిన్న పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని విస్మ‌యానికి గురి చేసే అమ‌లాపాల్ ప్ర‌స్తుతం ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆడై అనే చిత్రం చేస్తుంది. తెలుగులో ఈ చిత్రం ఆమె పేరుతో రిలీజ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఇందులో చివ‌రి సీన్‌లో పూర్తి న‌గ్నంగా క‌నిపించి ప్రేక్ష‌కుల‌కి షాక్ ఇచ్చింది అమ‌లా. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైన న‌టిస్తాన‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది ఈ అమ్మ‌డు. టీజ‌ర్‌పై అభిమానులే కాదు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని స‌మంత త‌న ట్విట్ట‌ర్ ద్వారా .. ఆడై టీజ‌ర్ అద్భుతంగా ఉంది. ఎంతో ఆస‌క్తితో ఉత్కంఠ‌ని రేపేలా ఈ టీజ‌ర్ ఉంది. బెస్ట్ విషెస్ టూ అమ‌లా పాల్‌. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాని త‌న ట్వీట్‌లో పేర్కొంది స‌మంత‌. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ మూవీ కి ప్రదీప్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మంచి సబ్జెక్ట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు టీజ‌ర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. ఈ చిత్రం అమ‌లాపాల్‌కి మంచి హిట్ ఇస్తుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.1945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles