హాని క‌లిగించే స్నాక్స్ తిన‌మంటావా అన్న ప్ర‌శ్న‌కి సామ్ సమాధానం

Thu,March 14, 2019 10:13 AM
samantha straight answer to netigen

అక్కినేని కోడ‌లు స‌మంత టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రు అనే సంగ‌తి తెలిసిందే. ప‌లు సంస్థ‌ల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటున్న స‌మంత తాజాగా ఓ ప్రముఖ చిప్స్ కంపెనీని ప్ర‌చారం చేసే బాధ్య‌త‌ల‌ని తీసుకుంది. చిప్స్ ప్యాకెట్‌ తో ఫోటో దిగిన సామ్ ఈ కంపెనీకి ప్రచార‌క‌ర్త‌గా ఉండ‌డం సంతోషంగా ఉంద‌ని త‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ పెట్టింది. అయితే ఆ చిప్స్ ఆరోగ్యానికి హానిక‌రం. అవి తింటే అనారోగ్యానికి గుర‌వుతాం. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకునే నువ్వు ఇలా హాని క‌లిగించే ఫుడ్ తిన‌మ‌ని ప్ర‌చారం చేయ‌డం ఏ బాగోలేదు అంటూ ప‌లువురు నెటిజన్స్ స‌మంత‌కి ట్వీట్స్ చేశారు. దీనిపై స్పందించింది స‌మంత‌. నా సండే మీల్స్ ఫోటోని మీకు పంపిస్తా. అవును. నేను ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటాను. అలాగే చీట్ డేస్‌లో ఓ సామాన్యురాలిగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవ‌డం ఇష్టం. ఈ బ్రాండ్ స్నాక్స్ నాతో పాటు మీరు అడిగే ప్ర‌తి ప్ర‌శ్నకి స‌మాధానం చెబుతుంది అని నెటిజ‌న్స్‌కి స‌మాధానం ఇచ్చింది. మ‌జిలీ చిత్ర ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న స‌మంత త్వ‌ర‌లో నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఓ బేబీ.. ఎంత సక్కగున్నావే’ అనే చిత్రం చేయ‌నుంది. కొరియన్‌ సినిమా ‘గ్రానీ’ రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. మ‌జిలి చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


2482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles