స‌మంత స్టంట్ చూస్తే ముక్కున వేలేసుకోవ‌ల్సిందే..!

Thu,August 22, 2019 12:17 PM
samantha stunts gives surprise

అగ్ర క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ని చ‌విచూసింది. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన స‌మంత వ‌ర్క్ విష‌యంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఫిట్‌నెస్ కోసం కూడా చాలా శ్ర‌మ‌ప‌డుతుంటుంది. తాను జిమ్‌లో చేసే వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోల‌ని అప్పుడ‌ప్పుడు షేర్ చేస్తూ ఉండే స‌మంత రీసెంట్‌గా ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని ప‌ట్టుకొని రెండు చేతుల‌తో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. స‌మంతలో దాగి ఉన్న సామ‌ర్ద్యాన్ని చూసి నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి సామ్.. ‘కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి .. మీ సామర్థ్యం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.’ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ఆమె వీడియోని చూసి షాక్ అయిన‌ న‌మ్ర‌త‌, కాజ‌ల్‌, పూజా హెగ్డే, సుశాంత్ త‌దిత‌ర ప్ర‌ముఖులు కామెంట్స్ పెట్టారు. స‌మంత అమేజింగ్ అని ప్ర‌శంసించారు.

3042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles