బాహుబ‌లి 3లో న‌టిస్తానంటున్న హాలీవుడ్ హీరో

Sun,March 10, 2019 07:51 AM
Samuel L Jackson desire to act in rajamouli Baahubali 3

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన చిత్రం బాహుబ‌లి. రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగానే కాదు అంత‌ర్జాతీయంగా కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. జ‌పాన్‌, చైనా వంటి దేశాల‌లోని సినీ ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని త‌మ సినిమాగా ఓన్ చేసుకొని సూప‌ర్ విజ‌యం అందించారు. అయితే ఇంత ఘ‌న విజ‌యం సాధించిన ఈ సిరీస్‌లో మూడో పార్ట్ తీస్తే బాగుంటుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. కాని చిత్ర రాజ‌మౌళి మాత్రం ఇప్ప‌ట్లో ఆ ఆలోచ‌న లేద‌ని ప‌లు మార్లు ప్ర‌స్తావించాడు.

తాజాగా ‘అవెంజర్స్‌’లో నిక్‌ ఫ్యూరీ పాత్ర పోషించిన జాక్సన్ త‌న త‌ర్వాతి చిత్రం ‘అవెంజర్స్‌: కెప్టెన్ మార్వెల్‌’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ సంద‌ర్బంగా ఇండియాకి వెళ్తారా అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా, పని క‌లిపిస్తే వెళ‌తా అని అన్నాడు. ఇక బాలీవుడ్‌లో ఏదైన సినిమా చేయాల‌నుకుంటున్నారా అని అడ‌గ్గా.. వెంట‌నే బాహుబ‌లి 3 చిత్రం కోసం ప‌నిచేయాల‌ని ఉంద‌ని చెప్పారు. దీంతో బాహుబ‌లి 3 మ‌రో సారి తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్‌తో బిజీగా ఉన్న రాజ‌మౌళి భ‌విష్య‌త్‌లో బాహుబ‌లి 3 చేస్తాడా అనేది చూడాలి.

4362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles