ఇటు తండ్రి సినిమాలో, అటు కొడుకు సినిమాలో..

Fri,April 5, 2019 08:36 AM

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ దిశ‌లా వ్యాపించేలా చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఈయ‌న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. చ‌ర‌ణ్‌కి గాయం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డింది. ఇందులో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఆయ‌న పాత్ర సినిమాకి చాలా కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇక రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలోను స‌ముద్ర‌ఖని ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తాజాగా స‌ముద్ర‌ఖ‌ని త‌న ట్విట్ట‌ర్‌లో రాజ‌మౌళితో క‌లిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఆకాశ‌వాణి సెట్‌లో దిగిన‌ట్టుగా తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌కి బ్రేక్ ప‌డ‌డం వ‌ల‌న రాజ‌మౌళి.. ఆకాశ‌వాణి షూటింగ్ స్పాట్‌కి వెళ్లారు. ఆ స‌మ‌యంలో జ‌క్క‌న్న‌, స‌ముద్ర‌ఖ‌ని ఫోటో దిగారు. ఒక వైపు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తూ మ‌రో వైపు కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాలో న‌టిస్తున్న ఈ త‌మిళ స్టార్ త‌న పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క మెప్పిస్తాడ‌ని అంటున్నారు .

3832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles