వ‌చ్చే ఏడాది ఈద్‌కి స‌ల్మాన్ చిత్రం.. క‌థానాయిక‌గా అలియా

Fri,June 7, 2019 12:30 PM
Sanjay Leela Bhansali film Inshallah to release on Eid next year

ఈద్ కానుక‌గా విడుద‌లైన స‌ల్మాన్ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రేస్ , ట్యూబ్‌లైట్ త‌దిత‌ర చిత్రాల‌ని ఈద్ కానుక‌గా విడుద‌ల చేసిన స‌ల్మాన్ ఈ ఏడాది భార‌త్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించిన‌ట్టు క‌లెక్ష‌న్స్‌ని చూస్తే తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది ఈద్‌కి కూడా స‌ల్మాన్ చిత్రం విడుద‌ల కానుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రంలో అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇన్షా అల్లా అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేశారు. 1999 లో వ‌చ్చిన హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్ అనే చిత్రం కోసం స‌ల్మాన్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ క‌లిసి ప‌ని చేశారు. 20 ఏళ్ళ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ రానుండ‌డంతో అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అలియా త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది. అలియా ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో పాటు క‌ళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేస్తుంది.1501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles