విద్యాబాలన్ కూతురిగా ‘దంగల్’ బ్యూటీ

Mon,September 23, 2019 05:03 PM


దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సన్యా మల్హోత్రా. ఈ హీరోయిన్ తక్కువ సమయంలోనే దంగల్, బాద్ షాహో వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది. తాజాగా అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది సన్యా. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ‘శకుంతలా దేవి..హ్యూమన్ కంప్యూటర్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో విద్యాబాలన్ కూతురి పాత్రలో సన్యామల్హోత్రా నటిస్తోంది. ఈ సినిమాలో శకుంతాలాదేవి కూతురి (అనుపమ బెనర్జీ)పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉందని సన్యా ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ తో ఓ వీడియో పోస్ట్ చేసింది.


1497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles