గోల్డెన్ లెహెంగాలో మెరిసిపోయిన సారా అలీ ఖాన్.. వైరల్ ఫోటో

Fri,March 22, 2019 03:17 PM
Sara Ali Khan posts her photo with gold lehenga on occasion of holi

సారా అలీ ఖాన్.. ఇప్పుడ బాలీవుడ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం జాన్వీ, సారాదే హవా. ఇప్పటికే సింబా హిట్‌తో మంచి హుషారు మీదున్న సారా.. హోలీ సందర్భంగా గోల్డెన్ లెహెంగా ధరించి మెరిసిపోయింది. సారా తరుచుగా అబు జాని, సందీప్ ఖోస్లా, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఔట్‌ఫిట్స్‌ను ధరిస్తుంటుంది. తాజాగా ఆమె గోల్డెన్ లెహెంగా ధరించి తన అభిమానులకు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది.


అయితే.. ఏమాత్రం జ్యుయెలరీ లేకుండా కేవలం తను వేసుకున్న డ్రెస్‌తో మెరిసిపోయిన సారాను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే.. సారా ఇప్పుడే కాదు.. ఏ స్పెషల్ అకేషన్‌లో అయినా జ్యుయెలరీని ఎక్కువగా వాడకుండా సింపుల్ అండ్ సూపర్బ్‌గా రెడీ అవుతుంది సారా. అది మూవీ ప్రమోషన్ అయినా.. సాధారణంగా ఏదైనా వేడుక అయినా.. సింపుల్‌గా రెడీ అయి ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది సారా. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా గోల్డెన్ లెహెంగాలో మెరిసిపోయిన సారా అలీ ఖాన్ ఫోటో చూసేయండి మరి..
View this post on Instagram

👑👸🤩⚡️

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


View this post on Instagram

10 days to #kedarnath 😍🤩👀

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles