సరిలేరు నీకెవ్వ‌రు నుండి మ‌హేష్ లుక్ ఔట్..!

Sat,July 20, 2019 09:11 AM

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం మ‌హేష్ 26వ చిత్రంగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజులుగా కశ్మీర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ఈ నెల 26 నుండి జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని అనీల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ మ‌హేష్ లుక్ ఒక‌టి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో మ‌హేష్ ఆర్మీ క్యాప్ ధ‌రించి , కళ్ళ అద్దాలు పెట్టుకొని స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. విజ‌య్ శాంతి కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

1438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles