ఇండియ‌న్ ఆర్మీకి మ‌హేష్ అండ్ టీం స‌లాం -వీడియో

Thu,August 15, 2019 08:39 AM
Sarileru Neekevvaru Title Song

స‌రిలేరు నీకెవ్వ‌రు టీం ఇండియ‌న్ ఆర్మీకి ట్రిబ్యూట్‌గా టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేసింది. దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్ రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తుంది. 73వ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో చిత్ర యూనిట్ ఈ సాంగ్ విడుద‌ల చేసింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా సంక్రాంతి కానుకగా చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌ల మహేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఇంట్రో వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. చిత్రంలో బండ్ల గ‌ణేష్‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ న‌టులు న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles