'శాటిలైట్ శంకర్' ట్రైల‌ర్ విడుద‌ల‌

Thu,October 17, 2019 01:17 PM

బాలీవుడ్‌ నటుడు సూరజ్‌ పంచోలి నటిస్తున్న తాజా చిత్రం 'శాటిలైట్‌ శంకర్‌'. ఇర్ఫాన్‌ కమల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూరజ్‌ సైనికుడిగా నటిస్తున్నారు. దేశ భక్తి ప్రధానంగా ఓ సైనికుడు చేసే సాహసోపేతమైన జర్నీ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ జర్నీ చేసే క్రమంలో అసలు వాస్తవాలను తానెలా తెలుసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంద‌ట‌. ఈ సినిమాని న‌వంబ‌ర్ 15న‌ విడుదల చేయనున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సైనికుడిగా సూర‌జ్ అద‌రగొట్టాడు. మేఘ ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టించింది. చిత్ర ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మీరు ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles