మెగా ఫోన్ ప‌ట్టిన సీనియ‌ర్ విల‌న్

Sun,October 13, 2019 09:48 AM

రెండు ద‌శాబ్దాల‌కి పైగా విల‌న్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న స‌త్య‌ప్ర‌కాశ్ మెగా ఫోన్ ప‌ట్టాడు. ఊల్లాల ఊల్లాల అనే టైటిల్‌తో సినిమా తెర‌కెక్కించాడు. రక్షకభటుడు, ఆనందం, లవర్స్ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఏ గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.న‌వంబ‌ర్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తుండ‌గా, చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ని వెంకీ చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన‌ట్టు తెలుస్తుంది. స‌త్య‌ప్ర‌కాశ్ త‌న‌యుడు న‌ట‌రాజ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నూరీన్ షెరీఫ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, అదుర్స్ ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. సంగీతం జాయ్ అందిస్తున్నారు. ఈ మూవీ విజయం పై దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

1647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles