మార్చి 16న 'స‌వ్య‌సాచి' ఫ‌స్ట్ పంచ్‌

Thu,March 15, 2018 10:54 AM

కూల్ అండ్ కామ్ గోయింగ్ హీరో నాగ చైత‌న్య ప్ర‌స్తుతం చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య సాచి సినిమా చేస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్నఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మార్చి 18న విడుద‌ల చేస్తామ‌ని ముందుగా ప్ర‌క‌టించారు. కాని ఆ డేట్ కాస్త ముందుకు జ‌రిగింది. మార్చి 16న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్న‌ ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ మూవీతో పాటుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్నాడు చైతూ. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న స‌తీమ‌ణితో క‌లిసి త్వ‌ర‌లో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు చైతూ. వీటి త‌ర్వాత డెబ్యూ డైరెక్ట‌ర్‌తోను ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇది అన్న‌పూర్ణ స్టూడియో బేన‌ర్‌పై రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది.1294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles