సంగీత ప్రియులని అల‌రిస్తున్న స‌వ్య‌సాచి సాంగ్‌

Fri,October 19, 2018 11:33 AM

తెలుగు సినిమాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు రాని స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతున్న చిత్రం స‌వ్య‌సాచి. న‌వంబ‌ర్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో నాగ చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు అని చూపించ‌నున్నారు.


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు.ఇటీవ‌ల రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా స‌వ్య‌సాచి సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తుంది. శివ‌ద‌త్తా, రామ‌కృష్ణ కోడూరి చిత్రానికి లిరిక్స్ అందించ‌గా, 16 మంది కోర‌స్ అందించారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

1590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles