స‌వ్య‌సాచి టీజ‌ర్‌కి టైం ఫిక్స్ చేసిన యూనిట్

Sun,September 30, 2018 08:46 AM

నాగ చైత‌న్య‌- చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌వ్య‌సాచి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్న‌ ఈ చిత్ర టీజ‌ర్‌ని అక్టోబ‌ర్ 1 ఉద‌యం 10గం.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం చైతూ ఖాతాలో మ‌రో హిట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. న‌వంబ‌ర్ 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.

2261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles