ఆసక్తి రేకెత్తిస్తున్న సవ్యసాచి ట్రైలర్

Wed,October 24, 2018 03:31 PM

నాగ చైతన్య, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలలో చందూ మొండేటి తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాని సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ , టీజర్స్ సినిమా లవర్స్ లో ఆసక్తి రేకెత్తించాయి. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో చైతూ కనిపిస్తున్నాడు. మాధవన్ ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నాడు. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి ఈ చిత్రాన్ని కూడా చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది. భూమిక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.


1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles