అమీర్ ఖాన్, జైరా వాసిమ్... సీక్రెట్ సూప‌ర్ స్టార్ న్యూ పిక్

Mon,July 31, 2017 02:48 PM
Secret Super Star Movie New poster released by Aamir khan

దంగ‌ల్ మూవీ లో అమీర్ ఖాన్ కు కూతురు గా న‌టించిన అమ్మాయి జైర వాసిమ్ గుర్తుందా? ఆ అమ్మాయి లీడ్ లో న‌టిస్తున్న మూవీ సీక్రెట్ సూప‌ర్ స్టార్. ఈ మూవీ వ‌చ్చే దీపావ‌ళి కి రిలీజ్ కానుంది. ఈ మూవీలో అమీర్ ఖాన్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. మూవీ ఫ‌స్ట్ టీజ‌ర్ డిసెంబ‌ర్ 2016 లో రిలీజ్ అయిన త‌ర్వాత ఇప్పుడు ఆ మూవీ న్యూ లుక్ ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు అమీర్ ఖాన్. స్కూల్ కు వెళ్లే ఓ అమ్మాయి.. సింగ‌ర్ అవ్వాల‌నుకున్న క‌ల‌ను త‌న తండ్రి ఆపేస్తుంటాడు. త‌న తండ్రి కాద‌న్నా... ప్ర‌పంచానికి త‌న గొంతును ప‌రిచ‌యం చేయాల‌నుకున్న ఆ అమ్మాయి స్టోరే ఈ సీక్రెట్ సూప‌ర్ స్టార్. జైరా వాసిమ్ స్కూల్ అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్న‌ది. అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి డైరెక్ట‌ర్ అద్వైత్ చౌహాన్.2300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles