స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం సూప‌ర్ హిట్.. ఎందుకో తెలుసా?

Fri,August 9, 2019 11:25 AM
sentiment work outs for Sarileru Neekevvaru

మ‌హ‌ర్షి చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న 26వ చిత్రంగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నారు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఇంట్రో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఆర్మీ మేయర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో మ‌హేష్ లుక్ అదిరిపోయింది. ఫ‌స్ట్ లుక్‌ని చూసి ఈ చిత్రం భారీ విజ‌యం సాధించ‌డం ఖాయం అని అభిమానులు జోస్యాలు చెబుతున్నారు. అయితే సెంటిమెంట్ ప‌రంగాను ఈ సినిమా భారీ విజ‌యం సాధించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌హేష్ బాబు కెరీర్‌లో భారీ విజ‌యం సాధించిన ఒక్క‌డు, దూకుడు చిత్రాల‌లో ఆయ‌న అజ‌య్ అనే పాత్ర‌లో క‌నిపించి మెప్పించాడు. ఇప్పుడు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోను అజ‌య్ పాత్ర‌లోనే న‌టిస్తున్నాడు. దీంతో సెంటిమెంట్ ప‌రంగా ఈ సినిమా భారీ హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది.

2499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles