ఈవెంట్‌లో అంద‌రి ముందు ప్రియుడికి కిస్ ఇచ్చిన న‌టి- వీడియో

Fri,April 26, 2019 01:25 PM
serial actress kisses his girl friend in public

కంగనా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మ‌ణిక‌ర్ణిక చిత్రంలో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన అంకిత లొకాండే తాజాగా వార్త‌ల‌లోకి ఎక్కింది. కొన్నాళ్ళుగా ముంబైకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త విక్కీ జైన్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్న ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ఓ ప్రైవేట్ పార్టీకి హాజ‌రైంది. ఆ పార్టీలో అంకిత త‌న బాయ్ ఫ్రెండ్‌ విక్కీ జైన్‌తో ఆడిపాడారు. ఈ స‌మ‌యంలో అంకిత‌.. విక్కీని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ప‌బ్లిక్‌గా లిప్ లాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి వీడియోను నటుడు అర్జున్‌ బిజ్‌లానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంకిత‌.. పవిత్ర రిష్తా టీవీ షో చేసే స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ టీవీ రంగం నుండి వెండితెర‌కి వెళ్ల‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. సుషాంత్‌ 'రాబ్తా' సినిమా వీరిద్దరూ విడిపోవాడానికి కారణమైందని..క‌ృతి సనన్ కూడా దీనిలో భాగం పంచుకుందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. వీరిద్దరు విడిపోయిన తర్వాత అంకిత, బిలాల్ పూర్‌కు చెందిన విక్కీ జైన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది

5565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles