మార్చిలో సెట్స్‌పైకి వెళ్ళ‌నున్న షారూఖ్ చిత్రం..!

Tue,November 19, 2019 12:34 PM

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌- త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్‌లో క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంకి అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని, షారూఖ్ బ‌ర్త్‌డే( న‌వంబ‌ర్ 2) సంద‌ర్భంగా చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని అభిమానులు భావించారు. కాని ఆ రోజు చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేస్తారని తెలుస్తుండ‌గా, మూవీని వ‌చ్చే ఏడాది మార్చిలో సెట్స్‌పైకి తీసుకెళ‌తార‌ని బాలీవుడ్ మీడియా చెబుతుంది.


కొన్నాళ్ల నుండి స‌రైన సక్సెస్‌లు అందుకోలేక‌పోతున్న షారూఖ్ జీరో చిత్రం త‌ర్వాత సినిమాల‌కి కొంత విరామం ఇచ్చారు. అట్లీ చెప్పిన క‌థ షారూఖ్‌కి న‌చ్చ‌డంతో వెంట‌నే త‌న తాజా చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ చిత్రం మెర్స‌ల్ రీమేక్‌గా రూపొంద‌నుంద‌ని ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికి, ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌దు. అట్లీ చివ‌రిగా విజ‌య్ హీరోగా బిగిల్ అనే సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుద‌ల కాగా, రెండు భాష‌ల‌లో చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

742
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles