మీ ప్రేమ ఎప్ప‌టికీ ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను: షారూఖ్‌

Tue,October 15, 2019 12:48 PM

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కి దేశ విదేశాల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సినిమా హిట్‌, ఫ్లాప్ అనేది సంబంధం లేకుండా షారూఖ్‌ని అభిమానిస్తుంటారు. తాజాగా ట్విట్ట‌ర్‌లో షారూఖ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ 39 మిలియ‌న్స్‌కి చేరింది. నిన్న‌టి వ‌ర‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ 38.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌తో టాప్‌లో ఉండ‌గా, తాజాగా అమితాబ్‌ని షారూఖ్ అధిగ‌మించాడు. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు . మీ ప్రేమ నాపై ఎప్ప‌టికి ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు బాలీవుడ్ బాద్‌షా. ప్ర‌స్తుతం షారూఖ్ సౌదీ అరేబియాలో ఉన్నాడు. అక్క‌డ జ‌రిగిన‌ ‘జాయ్‌ ఫోరయ్‌ 2019’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌ స్టార్‌ జాసన్ మొమోవా, హాంకాంగ్‌ యాక్షన్‌ హీరో జాకీచాన్‌, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. జీరో సినిమా త‌ర్వాత మ‌రో సినిమాకి ఓకే చెప్ప‌ని షారూఖ్‌.. త‌న బ‌ర్త్‌డేకి అనౌన్స్‌మెంట్ చేస్తాడ‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.

1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles