అర్జున్ రెడ్డిపై క‌బీర్ సింగ్‌ ప్ర‌శంస‌లు

Sun,October 28, 2018 12:09 PM

అతి త‌క్కువ టైంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌రకొండ‌. అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. విజ‌య్ న‌టించిన‌ అర్జున్ రెడ్డి చిత్రం ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రీమేక్ అవుతుంది. హిందీలోను సందీప్ రెడ్డి వంగానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. షాహిద్ క‌పూర్, కైరా అద్వాణీ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందుతున్న హిందీ వ‌ర్షెన్ కి క‌బీర్ సింగ్‌ అనే టైటిల్ పెట్టారు. రీసెంట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌ర్శ‌కుడు సందీప్‌తో క‌లిసి దిగిన ఫోటోతో పాటు టైటిల్ పోస్ట‌ర్ షేర్ చేస్తూ .. కబీర్‌ సింగ్‌..అర్జున్‌రెడ్డి నుంచి మీకు బెస్ట్‌ విషెస్‌’ అని ట్వీట్ చేశాడు. దీనికి తాజాగా షాహిద్ స్పందించాడు. సినిమాలో నీ పాత్ర ఎంతో స్పూర్తి దాయ‌కంగా ఉంది. ఎన్ని రీమేక్‌లు చేసిన నీదే ఓరిజిన‌ల్ అని ట్వీట్‌లో తెలిపాడు. దీనికి విజ‌య్ రిప్లై ఇచ్చాడు. బిగ్ బ్ర‌ద‌ర్ మీ ప‌ట్ల నాకు ఎంతో ప్రేమ‌, గౌర‌వం ఉన్నాయి. మీరు సందీప్ క‌లిసి త‌ప్ప‌క మ్యాజిక్ చేస్తారు. మిమ్మల్ని కబీర్‌గా చూడాలని నాకూ ఎంతో ఆతృతగా ఉంది’ అని విజ‌య్ అన్నారు. వ‌చ్చే ఏడాది జూన్ 21న క‌బీర్ ఖాన్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళంలోను అర్జున్ రెడ్డి రీమేక్ అవుతుండ‌గా, అక్క‌డ వ‌ర్మ పేరుతో రిలీజ్‌కానుంది.


3252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles