మేడ‌మ్ టుస్సాడ్స్‌లో అర్జున్ రెడ్డి రీమేక్ చిత్ర హీరో విగ్ర‌హం

Fri,May 10, 2019 12:06 PM
Shahid Kapoor reveals he will unveil his wax statue

ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ప‌లువురి సెల‌బ్రిటీల మైన‌పు విగ్ర‌హాల‌ని త‌యారు చేసి ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో ఉంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల బాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిటీలు ప్రియాంక చోప్రా, అనుష్క శ‌ర్మ‌, దీపికా ప‌దుకొణే , క‌ర‌ణ్ జోహార్ మైన‌పు విగ్ర‌హాల‌ని ఆవిష్క‌రించారు. ఇక ఇప్పుడు అర్జున్ రీమేక్ చిత్ర హీరో షాహిద్ క‌పూర్ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నార‌ట‌. వారం రోజుల‌లో త‌న మైన‌పు విగ్ర‌హాన్ని సింగ‌పూర్‌లో ఆవిష్క‌రించ‌నున్నాను. పూర్తి వివ‌రాల‌కోసం వేచి చూస్తూ ఉండండి అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు షాహిద్ క‌పూర్. ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం క‌బీర్ సింగ్‌తో షాహిద్ బిజీగా ఉన్నారు. ఇందులో కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. జూన్ 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.



1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles