HomeLATEST NEWSShahid Kapoor Unveils His Wax Statue

సింగ‌పూర్‌లో షాహిద్ క‌పూర్ మైన‌పు విగ్ర‌హం

Published: Thu,May 16, 2019 12:04 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ అరుదైన ఘ‌న‌త‌ని పొందాడు . ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థలో త‌న విగ్ర‌హాన్ని తానే ఆవిష్క‌రించుకున్నాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాక్స్ స్టాచ్యూతో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. క‌వ‌ల‌లు అనే కామెంట్ పెట్టాడు. మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో షాహిద్‌తో పాటు ఆయ‌న భార్య మీరా రాజ్‌పుత్‌, పిల్ల‌లు మిషా, జైన్ క‌పూర్ హాజ‌ర‌య్యారు. బ్లాక్ అండ్ వైట్ సూట్‌లో షాహిద్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌టికే బాలీవుడ్‌కి సంబంధించిన సెల‌బ్రిటీలు ప్రియాంక చోప్రా, అనుష్క శ‌ర్మ‌, దీపికా ప‌దుకొణే , క‌ర‌ణ్ జోహార్ మైన‌పు విగ్ర‌హాల‌ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో ఉంచిన సంగ‌తి తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం క‌బీర్ సింగ్‌తో షాహిద్ బిజీగా ఉన్నారు. ఇందులో కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. జూన్ 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.
1010
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology