ముంబై: బాలీవుడ్ స్టార్లు షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటిస్తోన్న చిత్రం కబీర్ సింగ్. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ లో ముద్దు సన్నివేశాలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రిపోర్టర్ సినిమాలో ఎన్ని కిస్ సీన్లు ఉన్నాయని హీరోయిన్ కియారా అద్వానీని ప్రశ్నించాడు. ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేదని దీనికి సమాధానమిచ్చింది కియారా. రిపోర్టర్ పదే పదే అదే ప్రశ్న అడుగుతుండటంతో పక్కనే ఉన్న షాహిద్ కపూర్ కు కోపం వచ్చింది. నీకు గాల్ ఫ్రెండ్ లేనట్లనిపిస్తోంది. మా చిత్రంలో లిప్ లాక్ సీన్ చూడాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే..ఒక్క సీన్ కోసమే అని చెప్పడం లేదు. సినిమాను వదిలిపెట్టి కేవలం ముద్దు సన్నివేశాలపై ఎందుకు అడుతున్నారని మండిపడ్డాడు.