తన స్కూల్‌లో సందడి చేసిన షారుక్‌ఖాన్..ఫొటోలు

Wed,October 23, 2019 06:26 PM


న్యూఢిల్లీ: ఢిల్లీలోని సెయింట్ కొలంబాస్ స్కూల్ యాజమాన్యం తన పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థికి స్వాగత ఏర్పాట్లు చేసింది. అతడెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్. స్కూల్ ప్రాంగణంలో ఓ కారు వచ్చి ఆగింది. విద్యార్థులు, స్కూల్ సిబ్బంది అంతా అటువైపే చూస్తున్నారు. ప్రిన్సిపాల్ ఈవీ మిరండాతోపాటు మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్ ప్రావీణ్యం ఉన్న 18 మంది విద్యార్థులు కూడా వారిలో ఉన్నారు.


షారుక్ కారులో నుంచి దిగాడు. అప్పటివరకు షారుక్ రావడమేంటని జోక్ వేసుకున్న విద్యార్థులు..ఒక్కసారిగా షారుక్ ను చూసేసరికి షాక్ అయ్యారు. షారుక్ విద్యార్థుల దగ్గరికి వచ్చి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. తాము ఎంతగానో ఆరాధించే, అభిమానించే సూపర్‌స్టార్ ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేసరికి కొందరు విద్యార్థులు సంతోషంతో ఏడ్చేశారు. ఇది మాకెంతో ప్రత్యేకమైన సందర్భమని ఓ విద్యార్థి అన్నాడు. ఈ సందర్భంగా షారుక్ స్కూల్ తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నాడు. మిగతా విద్యార్థుల్లాగే షారుక్ కూడా క్లాస్‌లకు డుమ్మా కొట్టేవారని ఓ విద్యార్థి చెప్పాడు. షారుక్ తన స్కూల్ విద్యార్థులతో గడిపిన క్షణాలను అతని ప్రొడక్షన్ హౌజ్ టీం కెమెరాల్లో బంధించింది.


2786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles