నా కూతురి పెళ్లికి న‌న్ను పిల‌వ‌డం మ‌ర‌చిపోవ‌ద్దు

Fri,July 12, 2019 08:47 AM

సాహో బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ పెళ్లికి సంబంధించిన వార్త‌ల‌కి పులిస్టాప్ ప‌డ‌డం లేదు. శ్ర‌ద్ధా క‌పూర్ కొద్ది రోజులుగా రోహాన్ శ్రేష్ఠ అనే ఫోటోగ్రాఫ‌ర్‌తో ప్రేమాయ‌ణంలో ఉంద‌ని, వారి వివాహం 2020లో జ‌ర‌గ‌నుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అవ‌న్నీ అవాస్త‌వాలు. వాటిలో ఎలాంటి నిజం లేదు. ఆమె మ‌రో ఐదేళ్ళు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేదు. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. రెండేళ్ళ వ‌ర‌కు క్యాలెండ‌ర్ బిజీగా ఉంది. ఆమె త‌న జీవితంలో సంతోషంగా ఉంది. పేరెంట్స్ అనుమ‌తి లేకుండా శ్ర‌ద్దా వివాహం చేసుకోదు అని శ‌క్తి అన్నారు. తాజాగా మ‌రోసారి శ్ర‌ద్ధా క‌పూర్ పెళ్లికి సంబంధించి ముంబైకు చెందిన ప‌త్రిక‌లు పలు వార్త‌లు ప్ర‌చురించాయి. దీనిపై ఈ సారి కాస్త వ్యంగ్యంగా స్పందించారు శక్తి క‌పూర్. నా కూతురు నిజంగా పెళ్లి చేసుకుంటుందా..! ఎప్పుడు.. ఎక్క‌డ‌.. తండ్రిగా నేను లేకుండానే పెళ్లి జ‌రుగుతుందా ? నా కూతురి పెళ్ళికి న‌న్ను పిల‌వ‌డం మ‌రచిపోకండే అంటూ కాస్త సెటైరిక‌ల్‌గా స్పందించారు అల‌నాటి బాలీవుడ్ స్టార్. త‌న కుమార్తె జీవితంలో జ‌రిగే ప్ర‌తి విష‌యం త‌న‌కు చెబుతుందని, ఆధారాలు లేకుండా త‌ప్పుడు వార్త‌ల‌ని ప్రచురించ‌కండి అని శ‌క్తి కపూర్ స్ప‌ష్టం చేశారు. శ్ర‌ద్ధా క‌పూర్ సాహో చిత్రంతో పాటు చిచ్చోరే, ఏబీసీడీ 3, బాఘీ 3, స్ట్రీట్ డ్యాన్స‌ర్‌ చిత్రాల‌లో నటిస్తుంది . డెంగ్యూ వ‌ల‌న తాను సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న విష‌యం విదిత‌మే.

3235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles