కోలీవుడ్ ద‌ర్శ‌కుల‌తో సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న శంక‌ర్

Mon,April 22, 2019 11:25 AM
Shankars 25 years in Indian Cinema

టెక్ మాంత్రికుడు శంక‌ర్ సినిమాలంటే ప్రేక్ష‌కుల‌కి ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయ‌న సినిమాల కోసం ఆశ‌గా ఎదురు చూస్తుంట‌గారు. ఇటీవ‌ల 2.0 అనే విజువ‌ల్ వండ‌ర్‌తో సినీ ప్రేక్ష‌కుల‌ని కొత్త లోకానికి తీసుకెళ్ళాడు శంక‌ర్. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో భార‌తీయుడు 2 చేస్తున్నాడు. ఆయ‌న సినీ ప్ర‌యాణం నిన్నటితో 25 ఏళ్ళ‌కి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న శిష్యుల‌తో క‌లిసి ఎంజాయ్ చేశాడు శంక‌ర్. ఇక చెన్నైలోని ద‌ర్శ‌కుడు మిష్క‌న్ కార్యాల‌యంలో శంక‌ర్‌తో కేక్ క‌ట్ చేయించారు ఆయ‌న శిష్యులు వసంతబాలన్, బాలాజీశక్తివేల్, అట్లీ. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మణిరత్నం, గౌతమ్‌మీనన్, లింగుసామి, శశి, పా.రంజిత్, పాండిరాజ్, మోహన్‌రాజా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీరంద‌రు ఓ సెల్ఫీ కూడా దిగారు. ఆ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

అసిస్టెంట్‌గా డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన శంక‌ర్.. ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్‌, పవిత్ర‌న్‌ల ద‌గ్గ‌ర ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత 1993లో జెంటిల్‌మెన్ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా పరిచ‌యం అయ్యాడు. ఈ చిత్రం శంకర్ కెరియ‌ర్‌ని మార్చివేసింది.ఈ చిత్రం త‌ర్వాత ఆయ‌న‌కి వ‌రుస‌గా ఆరు ప్రాజెక్టులు వ‌చ్చాయి. ముదల్వన్, బాయ్స్, జీన్స్, శివాజి, ఇండియన్, ఐ, ఎందిరన్ వంటి చిత్రాల‌తో శంక‌ర్ ఖ్యాతి ప్ర‌పంచ స్థాయికి చేరుకుంది. 25 ఏళ్ల సినీ కెరియ‌ర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌తో ప్రపంచ స్థాయి మార్కెట్‌ను తీసుకొచ్చిన శంక‌ర్ మ‌రెన్నో మంచి చిత్రాలు చేయాల‌ని మ‌నమంతా కోరుకుందాం .

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles