శ‌ర్వానంద్ కొత్త చిత్రం ప్రారంభం

Wed,August 28, 2019 11:58 AM

కుర్ర హీరో శ‌ర్వానంద్ మంచి జోరు మీదున్నాడు. ఇటీవ‌ల షూటింగ్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ శ‌ర్వా మళ్ళీ కోలుకొని వ‌రుస ప్రాజెక్టుల‌ని లైన్‌లో పెడుతున్నాడు. శ‌ర్వా ప్ర‌స్తుతం .. 96 త‌మిళ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు త‌న‌ 29వ చిత్రాన్ని కిశోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఇటీవ‌ల లాంచ్ అయిన ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకారం అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేసార‌నేది తెలియాల్సి ఉంది.


అతి పెద్ద ప్రొడ‌క్ష‌న్ సంస్థ డ్రీమ్ వారియ‌ర్‌పిక్ తాజాగా కొత్త చిత్రం లాంచ్ చేసింది. శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్‌లో రీతూ వ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నారు. చెన్నైలో చిత్ర తొలి షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ మూవీ కూడా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇటీవ‌ల రణరంగంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన శ‌ర్వానంద్ రానున్న రోజుల‌లో అభిమానుల‌కి నాన్‌స్టాప్ వినోదాన్ని పంచ‌నున్నాడు.


1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles