అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌కి నో చెప్పిన శ‌ర్వా.. కార‌ణం ?

Wed,December 19, 2018 12:21 PM
Sharwanand says no to arjun reddy director

ఇటీవ‌లి కాలంలో హిట్స్‌తో దూసుకెళుతున్న ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు మ‌న హీరోలు. కాని శ‌ర్వా ఇందుకు భిన్నంగా ఉన్నాడు. అర్జున్ రెడ్డి వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తీసిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు సిద్ధంగా లేన‌ని చెప్పాడు శ‌ర్వానంద్‌. వివ‌రాల‌లోకి వెళితే అర్జున్ రెడ్డి చిత్రాన్ని మొద‌ట శ‌ర్వానంద్‌తో తీయాల‌ని అనుకున్నాడు సందీప్‌. కాని దానికి నో చెప్ప‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేశాడు. ఇటీవ‌ల మ‌రోసారి శ‌ర్వానంద్‌ని క‌లిసి స్టోరీ వినిపించాడ‌ట. దానికి కూడా నో చెప్పాడంట ఈ గ్లామ‌ర్ హీరో. కంఫ‌ర్ట‌బుల్‌గా ఫీల‌య్యే పాత్ర‌లు మాత్ర‌మే తాను చేస్తాన‌ని చెప్పిన శ‌ర్వానంద్ క‌థ న‌చ్చ‌క‌పోతే సినిమా చేయ‌లేన‌ని అంటున్నాడు. శ‌ర్వానంద్ రీసెంట్‌గా ప‌డిప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రాన్ని చేశాడు. ఈ నెల 21న విడుద‌ల కానున్నీ చిత్రాన్ని హ‌నురాఘ‌వ పూడి తెర‌కెక్కించాడు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించ‌ని ఈ చిత్రం అందమైన ప్రేమకథగా రూపొందింది.

3144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles