స్కై డైవింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ శ‌ర్వా.. ప్ర‌మాదం ఏమి లేద‌న్న యూనిట్‌

Sun,June 16, 2019 10:30 AM

యువ హీరోలు అంద‌రు వ‌రుస‌గా ప్ర‌మాదాల బారిన ప‌డుతుండ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర ప‌రుస్తుంది. మొన్న‌టికి మొన్న ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌గా రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్‌, నాగ శౌర్య‌, సందీప్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు. తాజాగా యువ హీరో శ‌ర్వానంద్ కూడా షూటింగ్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆయ‌న 96 తెలుగు రీమేక్ కోసం థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌నకి చిన్న‌పాటి గాయం అయిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ కోలుకొని షూటింగ్‌లో పాల్గొంటాడ‌ని యూనిట్ చెబుతుంది.


అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే.. 96 చిత్రం కోసం థాయ్ లాండ్‌లో స్కై డైవ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు శ‌ర్వా. ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజులు బాగానే ప్రాక్టీస్ చేసిన శ‌ర్వానంద్ మూడోరోజు నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఐదోసారి ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి గాలి ఎక్కువ‌గా రావ‌డంతో కాళ్ళ‌పై ల్యాండ్ కావ‌ల‌సిన అత‌ను భుజాల‌ని మోపి ల్యాండ్ అయ్యాడ‌ట‌. దీంతో శ‌ర్వానంద్ షోల్డ‌ర్ డిస్ లొకేట్ అయిన‌ట్టుగా తెలుస్తుంది. కాలు కూడా ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్టు స‌మాచారం. ఘ‌ట‌న త‌ర్వాత శ‌ర్వానంద్ వెంట‌నే హైద‌రాబాద్‌కి చేరుకొని డైరెక్ట్‌గా సన్ షైన్ హాస్పిట‌ల్‌కి వెళ్లాడు. ఆయ‌న‌ని ప‌రీక్షించిన వైద్య బృందం భుజానికి బ‌ల‌మైన గాయం అయింద‌ని, శ‌స్త్ర చికిత్స తప్ప‌క చేయాల‌ని అన్నార‌ట‌. సోమ‌వారం శ‌స్త్ర చికిత్స చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆయ‌న‌కి వారం రోజుల‌పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు పేర్కొన్నట్టు స‌మాచారం.

96 తెలుగు రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా, ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు స‌మాచారం. చిత్రంలో శ‌ర్వానంద్ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, ఆయ‌న గార్ల్‌ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది. త‌మిళ చిత్రం 96లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన ఈ త‌మిళ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

1998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles