క‌త్రినా, శిఖ‌ర్‌కి అక్ష‌య్ డ‌బ్బా ఛాలెంజ్‌

Tue,January 14, 2020 08:32 AM

ఈ మ‌ధ్య కాలంలో మ‌నం ఎన్నో ఛాలెంజ్‌లు చూశాం. గ్రీన్ ఛాలెంజ్‌, కీకీ ఛాలెంజ్‌, ఐస్ బ‌కెట్ ఛాలెంజ్‌, బ్యాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఇలా ఎన్నో ఛాలెంజ్‌లు వ‌చ్చాయి. తాజాగా వాట్స్ ఇన్ యువ‌ర్ డ‌బ్బా అనే ఛాలెంజ్ బాలీవుడ్‌లో ట్రెండింగ్ అవుతుంది. ముందుగా అక్ష‌య్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా దీనిని మొద‌లు పెట్ట‌గా, ఆ ఛాలెంజ్‌ని అక్ష‌య్, మలైకా, సోనాలి బింద్రేకి విసిరింది. ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన అక్ష‌య్ కుమార్ త‌నకి ఛాలెంజ్ విసిరిన ట్వింకిల్‌కి థ్యాంక్స్ చెబుతూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ ఫోటోని షేర్ చేసాడు. ఈ ఛాలెంజ్‌ని కత్రినా కైఫ్‌, భూమి ప‌డ్నేక‌ర్, శిఖ‌ర్ ధావ‌న్‌ల‌కి విసిరాడు అక్ష‌య్. దీనిపై స్పందించిన శిఖ‌ర్ ధావ‌న్ త‌న‌కి ఛాలెంజ్ విసిరిన అక్ష‌య్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ.. బ్రేక్ ఫాస్ట్‌కి సంబంధించిన ఫుడ్‌ని ఫోటో తీసి షేర్ చేశాడు.


అయితే ‘నేను అప్పుడప్పుడు వడా పావ్ తింటూంటా. అయితే నా డబ్బాలో మాత్రం ఎప్పుడూ బీట్ రూట్ టిక్కీస్ ఉండాల్సిందే’ అంటూ ట్వింకిల్ విసిరిన ఈ ఛాలెంజ్‌కి మ‌లైకా అరోరా కూడా స్పందించి త‌ను లంచ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి షేర్ చేసింది. తాను శిల్పా శెట్టి, అర్జున్ కపూర్‌లకు సవాలు విసిరింది. ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తింటూ వాటికి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేయాలి. దాంతో పాటు ఈ ఛాలెంజ్‌ని మ‌రో ఇద్ద‌రికి విస‌రాలి. ప్ర‌స్తుతం ఈ ఛాలెంజ్ బాలీవుడ్‌లో ఫుల్ జోరుగా సాగుతుంది.

View this post on Instagram

Thank you @twinklerkhanna for nominating me. Eating clean is not an option but a way of life for me. Here’s a glimpse at what made me spring into action this morning 🕺 Sharing how you can also make my favourite avocado on toast and my chia pudding. It’s healthy, tasty, and keeps you full for hours, not to mention high in protein 😋 *Avocado on toast* Mash a ripe avocado. Add little olive oil, I like to add Rapeseed oil to it. Add a pinch of Himalayan Pink Salt, & a dash of chaat masala if you like things flavoursome. Spread the mashed avocado on two slices of toasted barley bread or any multigrain bread. Garnish with pomegranate. *Chia Pudding* Soak 3 teaspoons of chia seeds in walnut milk, overnight. Add a little honey or cinnamon to it. Top with seasonal fruits of your choice, preferably berries. Voila Bon Appetit 🙏🏽 Now you know what’s in my dabba, I nominate @katrinakaif @bhumipednekar and @shikhardofficial to give me a peek inside their dabbas. It would be great to know more healthy food options. Don’t forget to share a photo with #WhatsInYourDabba and tag @TweakIndia

A post shared by Akshay Kumar (@akshaykumar) on

938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles