టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్న మ‌రో వార‌సుడు!

Sun,October 7, 2018 08:37 AM
Shiva Kandukuri debut to tollywood

ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా కొన‌సాగుతూనే ఉంది. హీరోలు, ద‌ర్శక నిర్మాత‌ల కుమారులు హీరోగా ప‌రిచ‌య‌మై ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత కుమారుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. విజ‌య్ దేవ‌రకొండ ప్ర‌ధాన పాత్ర‌లో పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయ‌న త‌న కుమారుడిని హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి డెబ్యూ చిత్రాన్ని కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివ‌రాజ్ క‌నుమూరి తెర‌కెక్కించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. శివ‌రాజ్ చెప్పిన కథ రాజ్ కందుకూరికి బాగా నచ్చ‌డంతో ఈ స్టోరీతో తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తే.. బాగుంటుందని రాజ్ కందుకూరి భావిస్తోన్నారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తుంది.

7838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles