బాలీవుడ్ రీమేక్‌తో రాజ‌శేఖ‌ర్ కూతురు వెండితెర ఎంట్రీ..!

Tue,January 23, 2018 05:12 PM

రాజశేఖర్, జీవితల గారాల ప‌ట్టీ శివాని త్వరలో హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. కాక‌పోతే ఆమె తొలిసారి నటించబోయేది ఏ హీరోతో? ఎలాంటి సినిమా చేయబోతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆ మ‌ధ్య‌ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ హీరోగా పరిచయం అయ్యే సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందని వార్త‌లు రాగా, తాజాగా బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ తో శివానీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంద‌ని చెబుతున్నారు. అడ‌వి శేష్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండ‌గా, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు స‌మాచారం. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడట‌. ఇటీవ‌ల శివాని ఫోటో షూట్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. త్వ‌ర‌లో ప‌లు కోలీవుడ్ చిత్రాల‌లోను ఈ అమ్మ‌డికి ఆఫర్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు.

3462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles