మ‌రోసారి కొత్త హీరోతో జోడి క‌డుతున్న దొర‌సాని

Wed,June 12, 2019 08:42 AM
Shivathmika paired with megansh

యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ త‌న‌యలిద్ద‌రు టాలీవుడ్‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. రాజ‌శేఖ‌ర్ మొద‌టి కుమార్తె శివానీ 2 స్టేట్స్ రీమేక్‌తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానుండ‌గా, రెండో కూతురు శివాత్మిక దొర‌సాని చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతుంది. దొర‌సాని చిత్రంలో శివాత్మిక‌తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ న‌టిస్తున్నాడు. వీరిద్ద‌రికి ఈ చిత్రం డెబ్యూ కాగా, ఈ మూవీపై వారిద్ద‌రు భారీ హోప్స్ పెట్టుకున్నారు. జూలై 5న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర నిర్మాత‌లు. అయితే శివాత్మిక తొలి సినిమా రిలీజ్ కాక‌ముందే ఆమెకి మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిందట‌. శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంష్‌తో క‌లిసి రెండో సినిమా చేసేందుకు సిద్ధ‌మైంద‌ట శివాత్మిక. ఈ సినిమాని ఎమ్ఎల్‌వీ స‌త్యనారాయ‌ణ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. మేఘాంష్ ప్ర‌స్తుతం రాజ్ దూత్ అనే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచ‌యం అవుతున్నాడు మేఘాంష్‌.

2367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles