అంత‌ర్జాతీయ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న తొలి సౌత్ భామ‌

Thu,June 20, 2019 01:47 PM

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక అక్క‌డ నుండి తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ రేంజ్‌కి వెళ్లింది. అయితే మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణంలో ప‌డ్డ త‌ర్వాత దాదాపు రెండేళ్ళ‌పాటు సినిమాలకి దూరంగా ఉంది. ఇటీవ‌ల వారి ప్రేమ‌కి ఎండ్ కార్డ్ ప‌డ‌డంతో మ‌ళ్ళీ సినిమాల‌పై దృష్టి సారించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన లాభం అనే చిత్రం, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయ‌నుంది. తాజాగా ఈ అమ్మ‌డికి జాక్‌పాట్ త‌గిలింది.


అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర ఎంపికైంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. ఢిల్లీలో ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ ర‌హ‌స్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్‌ ప్రాంతంలో జరగనున్న షెడ్యూల్‌లో శృతిహాసన్‌ పాల్గొననున్నారు. నీరా ప‌టేల్ అనే పాత్ర‌లో శృతి క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం త‌న పాత్ర‌కి సంబంధించిన ప్రిప‌రేష‌న్‌లో ఉంద‌ట శృతి. అంత‌ర్జాతీయ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న తొలి సౌత్ భామ శృతి కాగా, ఈ అమ్మ‌డికి ఈ సిరీస్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తే.. హాలీవుడ్ త‌లపు త‌ట్ట‌డం ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు.


2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles