ఇన్నాళ్ళ‌కి మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోబోతున్న‌ శృతి హాస‌న్

Mon,April 22, 2019 12:09 PM
shruti haasan Started work on new project today

సక‌ల క‌ళావ‌ల్ల‌భుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల పట్టీ శృతి హాస‌న్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌టిగా, సింగ‌ర్‌గా, ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో విభాగాల‌లో త‌న ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుంటుంది. తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్ర సీమ‌ల్లో ఓ వెలుగు వెలుగుతుంది శృతి. అయితే ఈ అమ్మ‌డు సినిమాలు విడుద‌ల కాక చాలా రోజులు అవుతుంది. దీంతో అభిమానులు ఆమె సినిమాల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ మ‌ధ్య శ‌భాష్ నాయుడు అనే చిత్రంలో క‌మల్‌తో క‌లిసి శృతి న‌టించింది. కాని ఈ సినిమా ఇప్ప‌ట్లో విడుద‌ల‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అయితే తాజాగా సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మైంది శృతి హాస‌న్. పురంపొక్కు ఎంగిర పొతువుద‌మై ఫేం ఎస్‌పీ జ‌న‌నథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. లాభం అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. దేశంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల గురించి ఈ చిత్రంలో వివ‌రించనున్న‌ట్టు స‌మాచారం.


2395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles