నానికి విల‌న్‌గా బొమ్మ‌రిల్లు హీరో ..!

Fri,November 30, 2018 10:34 AM
siddharth to be villain in nani movie

బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో సిద్ధార్ద్‌. ప్ర‌స్తుతం తెలుగులో సిద్ధార్థ్ సినిమాలేవి విడుద‌ల కావ‌డం లేదు. త‌మిళంలోను ఆయ‌న అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న విల‌న్ పాత్ర‌లో క‌నిపించేందుకు ఆసక్తి చూపుతున్న‌ట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ త్వ‌ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని, క్రేజీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తుంద‌ట‌. ఇప్ప‌టికే నానికి సంబంధించిన ఫోటో షూట్ కూడా పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. వ‌చ్చే ఏడాది ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ని అంటున్నారు. ఇందులో విలన్‌ పాత్రలో హీరో సిద్ధార్థ్‌ కనిపిస్తారని సమాచారం. తెర వెనుక నాని, సిద్ధార్ద్ మంచి ఫ్రెండ్స్ కాగా వెండితెర‌పై వీరిద్ద‌రి మ‌ధ్య వైరం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. నాని ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుద‌ల కానుంది.ఈ మూవీ త‌ర్వాత ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

3304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles