మొద‌లైన అనుష్క 'సైలెన్స్' షూటింగ్

Sat,May 25, 2019 09:40 AM
silence shoot starts from today

అందాల భామ‌ అనుష్క హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెన్స్ అనే చిత్రం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. తొలి రోజు తొలి షాట్‌ని చిత్రీక‌రించిన‌ట్టు ద‌ర్శ‌కుడు హేమంత్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. రామోజీ ఫిలిం సిటీలో తొలి షెడ్యూల్ తెరకెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆ త‌ర్వాత అమెరికాకి ప‌య‌నం కానుంది చిత్ర బృందం. తమిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తుంది. తెలుగులో ఈ చిత్రానికి నిశ‌బ్ధం అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles