మార్చిలో షూటింగ్‌.. డిసెంబ‌ర్‌లో రిలీజ్

Sat,January 12, 2019 08:40 AM
silence shooting starts from march

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క లేట్‌గా వ‌చ్చిన లేటెస్ట్‌గా వ‌స్తుంది. గ‌త ఏడాది మొద‌ట్లో భాగ‌మ‌తి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ఓ సినిమాకి సైన్ చేసింది. సైజ్ జీరో చిత్రం కోసం భారీ బ‌రువు పెరిగిన అనుష్క బ‌రువు తగ్గేందుకు నానా క‌ష్టాలు ప‌డింది. విదేశాల‌లో ప‌లు ట్రీట్‌మెంట్స్ తీసుకున్న అనుష్క రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఆమె త్వ‌ర‌లో ఓ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌నుండ‌గా, ఈ చిత్రానికి కోన వెంకట్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది.

ఈ చిత్రంలో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ లో అనుష్క , మాధవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగు త‌మిళ భాష‌ల‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నటుడు సుబ్బరాజు కూడా చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అంటున్నారు. ఏడాది చివర్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఆయన ఈ సినిమా కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను కంపోజ్ చేశారట.

2285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles