సితార క్యూట్ డ్యాన్స్‌పై ఓ లుక్కేయండి

Tue,August 13, 2019 11:28 AM
Sitara dancing for paaala pitta

మ‌హేష్ గారాల ప‌ట్టి సితారకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అడ‌పాద‌డ‌పా ఆమెకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌డం, వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఆ మ‌ధ్య సొంతంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన సితార ఇందులో A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే అప్పుడ‌ప్పుడు క్యూట్ డ్యాన్స్‌తోను సంద‌డి చేసే సితార తాజాగా మ‌హ‌ర్షి చిత్రంలోని పాల‌పిట్ట‌... అనే సాంగ్‌కి క్యూట్ స్టెప్స్ వేసింది. ఈ డ్యాన్స్‌కి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు . మీరు డ్యాన్స్ వీడియోపై ఓ లుక్కేయండి.1520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles