చిరు అల్లుడి రెండో సినిమాకి స్మాల్ బ్రేక్

Tue,July 23, 2019 11:49 AM
small break for kalyan dev movie

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో రెండో సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు క‌ళ్యాణ్‌. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో క‌ళ్యాణ్ త‌న రెండో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాని పులి వాసు తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ షెడ్యూల్ ప్రారంభ‌మై చాలా రోజులే అవుతున్న‌, రెండో షెడ్యూల్ ఇప్ప‌టికి ప్రారంభించ‌లేదు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సీన్స్ చూసిన టీం స్టోరీని కాస్త డెవ‌ల‌ప్ చేసి షూట్ చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌. దీంతో చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ‌ట్టు టాక్ న‌డుస్తుంది. .సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు. ఇప్ప‌టికే చిత్ర నిర్మాణ సంస్థ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో క‌ళ్యాణ్ దేవ్ డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో స‌రికొత్త‌గా క‌నిపించాడు. ఈ సినిమాతో త‌ప్ప‌క విజ‌యం సాధించాల‌నే క‌సితో ఉన్నాడు మెగా అల్లుడు .

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles