షబానా, స్మృతి, మలైకా..పాత ఫొటోలు వైరల్

Thu,October 31, 2019 05:02 PM

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది చాలా మంది చెప్పే మాట. కొన్నేళ్ల క్రితం బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఎంతమంచి కలర్‌ఫొటోలు వచ్చినా అప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకున్న క్రేజే వేరు. ఇపుడు కొంతమంది సెలబ్రిటీల పాత ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ యంగ్ లుక్‌లో ఉన్నప్పటి పాత ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..కేవలం గంటలోపే ఆ ఫొటోకు 12వేల లైక్స్ వచ్చాయి. బ్యూటీఫుల్, సో ప్రెట్టీ అంటూ ఆమె ఫాలోవర్లు ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు అలనాటి అందాల నటి షబానా అజ్మీ చాలా ఏళ్ల క్రితం అంటూ పెట్టిన పాత ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. దీనికి 3వేలకుపైగా లైక్స్ వచ్చాయి. బాలీవుడ్ నటి మలైకా అరోరా పసుపు రంగు డ్రెస్‌లో ఉన్నపుడు క్లిక్‌మనించినపుడు దిగిన కలర్ ఫొటోకు కేవలం 3 గంటల్లో 88వేల లైక్స్ వచ్చాయి.


3326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles