వైర‌ల్‌గా మారిన స్నేహ సీమంతం వేడుక ఫోటోలు

Fri,October 4, 2019 10:55 AM

తెలుగింటి సీతమ్మగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్న స్నేహ పెళ్ళి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమైంది. అచ్చముండు..అచ్చముండు సినిమాలో స్నేహ‌, త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. 2012లో వీరి వివాహం జ‌రిగింది. 2015లో స్నేహ‌కి కుమారుడు జ‌న్మించ‌గా, ఆయ‌న‌కి విహాన్ అనే పేరు పెట్టారు. ప్ర‌స్తుతం స్నేహ గ‌ర్భ‌వ‌తి కాగా, ఆమె సీమంతం వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బంధువులు, స్నేహితులు హాజ‌ర‌య్యారు. స్నేహ‌.. త‌న సీమంతం వేడుక ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. స్నేహాకి ప‌లువురు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. స్నేహ చివ‌రిగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ చిత్రంతో పాటు త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా తెర‌కెక్కిన‌ వెలైక్కార‌న్ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆమె న‌టించిన ప‌ట్టాస్, వాన్ చిత్రాలు త్వర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.




33497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles