నాకు మీమ్స్ ఇష్టం, మ‌రిన్ని మీమ్స్ చేయండి: సోనాక్షి

Sun,September 22, 2019 07:32 AM

నెటిజన్స్‌కి సెల‌బ్రిటీల‌ని ట్రోల్ చేయ‌డం కొత్తేమి కాదు. త‌మ‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై కొంద‌రు సెల‌బ్రిటీలు స్పందిస్తే మరికొంద‌రు సైలెంట్‌గా ఉంటారు. కాని బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా త‌న‌పై ట్రోల్స్ చేసే వారికి వినూత్న రీతిలో బదులిచ్చి వావ్ అనిపించింది. వివ‌రాల‌లోకి వెళితే సోనాక్షి సిన్హా ఈ శుక్ర‌వారం రాజ‌స్థాన్ నుండి వ‌చ్చిన ఓ పోటీదారురాలికి మ‌ద్దతుగా కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో 44వ ప్ర‌శ్నగా అమితాబ్ ‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అనే ప్ర‌శ్న అడిగారు . ఇందుకు ఆప్షన్స్‌గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు.


ఇంత ఈజీ ప్రశ్న‌కి సోనాక్షి లైఫ్ లైన్ తీసుకున్నారు. అయినప్పటికీ సరైన సమాధానం చెప్పలేకపోయారు. దాంతో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఎందుకంటే సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా. ఆయ‌న తన ఇంటికి రామాయణ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు తన ఇద్దరు కుమారులకు సీతారాముల కుమారులైన లవకుశల పేర్లు పెట్టుకున్నారు. మ‌రి రాముడిని అంతగా కొలిచేవారి కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి రామాయణానికి సంబంధించిన ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో నెటిజ‌న్స్ ఓ ఆట ఆడుకున్నారు . ‘sonakshi so dumb’ పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ప్రారంభించి ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.

ట్రోలింగ్‌పై తాజాగా స్పందించిన సోనాక్షి.. డియ‌ర్ ట్రోల‌ర్స్‌.. నాకు పైథాగ‌ర‌స్ సిద్ధాంతం, మ‌ర్చెంట్ ఆఫ్ వెనిస్‌, ఆవ‌ర్త‌న ప‌ట్టిక‌, మొఘ‌ల్ వంశ చ‌రిత్ర కూడా తెలియ‌దు. కాబ‌ట్టి ఖాళీగా ఉన్న నెటిజ‌న్స్ .. వీటిపైన కూడా మీమ్స్ చేయండి. నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం అంటూ త‌న‌దైన శైలిలో స్పందించింది సోనాక్షి.1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles