బ్యాడ్మింట‌న్ గేమ్ రూల్స్ తెలుసుకుంటున్న బాలీవుడ్ హీరో

Fri,May 10, 2019 09:55 AM
Sonu Sood To Play Pullela Gopichand in biopic

బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి,ఒలింపిక్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత పీవీ సింధు జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్ రూపొంద‌నున్న‌ విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఈ బయోపిక్ ను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటించనున్నారు. ప్ర‌స్తుతం తాను బ్యాడ్మింట‌న్ గేమ్ రూల్స్ తెలుసుకునే ప‌నిలో ఉన్నార‌ట‌. గోపిచంద్ పాత్ర‌లో న‌టించ‌డాన్ని తాను గౌర‌వంగా ఫీల‌వుతున్న‌ట్టు తెలిపారు సోనుసూద్. అంతేకాదు గోపిచంద్‌తో గేమ్‌కి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ‌లు కూడా చేస్తున్నాడ‌ట‌. పీవీ సింధు అంత‌ర్జాతీయ స్థాయిలో సాధించిన ఘ‌న‌ విజ‌యాల వెనుక గోపీచంద్ ఉన్నార‌నే విష‌యం విదిత‌మే. అయితే పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. మ‌రోవైపు గోపిచంద్ బయోపిక్ కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌వీణ్ చాలా రీసెర్చ్‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి యువ కెరటంలా దూసుకు వచ్చిన మహేష్ బావ సుధీర్ బాబు బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles