పోస్ట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన ప్ర‌భాస్

Tue,May 21, 2019 12:07 PM
special poster from saaho

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ చిత్రానికి పని చేస్తుండ‌గా, 150 కోట్ల రూపాయల పైగా బడ్జెట్‌తో చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివ‌రి షెడ్యూల్‌ని అక్క‌డే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ నిన్న త‌న ఎకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని అన్నాడు. అన్న‌ట్టుగానే సాహో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాడు. ఆగ‌స్ట్ 15న సాహో చిత్రం విడుద‌ల కానుంద‌ని పేర్కొన్నారు. న్యూ లుక్‌లో ప్ర‌భాస్ స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. సాహో చిత్రం యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుండ‌గా,ఈ చిత్రానికి శంకర్‌-ఎషెహన్‌-లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. సాహో చిత్రానికి సంబంధించి చాప్ట‌ర్ 1, చాప్ట‌ర్ 2 పేరుతో విడుద‌లైన వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం విదిత‌మే.

3122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles