స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వెంక‌టేష్ తదుప‌రి చిత్రం

Tue,September 24, 2019 08:55 AM

విక్టరీ వెంక‌టేష్ సెల‌క్టెడ్ ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ మంచి విజ‌యం సాధిస్తున్నాడు. ఆ మ‌ధ్య ఎఫ్ 2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన వెంకీ త్వ‌ర‌లో వెంకీ మామ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఇందులో వెంక‌టేష్ మేన‌ల్లుడు నాగ చైత‌న్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. క‌ట్ చేస్తే వెంక‌టేష్ త్వ‌ర‌లో త్రినాధ‌రావు న‌క్కిన‌, త‌రుణ్ భాస్క‌ర్‌ల‌తో డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ చేయ‌నున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ చిత్ర స్టోరీని సిద్ధం చేసుకుంటుండ‌గా, గుర్రపు పందెం ప్ర‌ధాన నేప‌థ్యంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం మ‌ల‌క్‌పేట్‌లోని హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్‌లో జ‌రుగుతుంద‌ట‌. వెంకీ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంద‌ట. సురేష్ బాబు చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. వెంకీ గ‌తంలో బాక్సింగ్ నేప‌థ్యంలో గురు అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రం చేసిన విష‌యం విదిత‌మే.

1280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles